![]() |
![]() |

బిగ్ బాస్ అగ్ని పరీక్ష షోలో సింగర్ శ్రీతేజను చూసాం. ఐతే ఇప్పుడు శ్రీతేజ టాప్ 5 లో లేడు. ఐతే బిగ్ బాస్ హౌస్ కి వెళ్తాడా లేదా అనే డౌట్ అందరిలో ఉంది. ఇక ఇన్స్టాగ్రామ్ పేజీలో ఆడియన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి స్టేటస్ లో పోస్ట్ చేసాడు. "మీకు బిగ్ బాస్ సెట్ అవదు తేజ" అని చెప్పేసరికి.."బిగ్ బాస్ లో ఒక్కొక్కరిని ఒక్కో రోజు చూసి మన డెసిషన్ మార్చుకుంటాం. మీ డెసిషన్ కూడా మారొచ్చేమో" అన్నాడు. ఇక ఇంకొంతమంది అడిగిన ప్రశ్నలకు వరసగా ఎం చెప్పాడంటే "బిగ్ బాస్ లో ఉంటాం..ఉంటాం..వైల్డ్ కార్డు ఎంట్రీనా కాదా అనే విషయాలు చెప్పేస్తారు మరి ..బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చేద్దాం భయ్యా..అన్నీ అప్పుడే చెప్పకూడదు.
మీ సపోర్ట్ ఉంటే బిగ్ బాస్ హౌస్ లో కచ్చితంగా ఉంటాను. ఒక ఎపిసోడ్ లో షోకి డైరెక్టర్ క్రిష్ వచ్చినప్పుడు అయన ముందు పెర్ఫర్మ్ చేయడం మర్చిపోలేను. కొంతమంది నన్ను కాంపిటీటర్ గా అనుకున్నారు. కానీ జ్యూరీ మాత్రం నేను బెస్ట్ అని చెప్పారు. కానీ ఆ విషయం టెలికాస్ట్ చేయలేదు. నా ఫెవరెట్ సింగర్ శ్రేయ గోషాల్ గారితో కొలాబరేట్ అయ్యి పాడాలని ఉంది. నన్ను నేను బిగ్ బాస్ హౌస్ లో చూసుకోవాలని ఉంది" అంటూ చెప్పుకొచ్చాడు. శ్రీతేజ గాయకుడిగా చాలా పాపులర్. తెలుగు సింగర్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సింగింగ్ సెక్షన్ నుంచి బిగ్ బాస్ టీమ్ ప్రతీ సీజన్ కి ఒకళ్ళను తీసుకుంటూ వస్తోంది. ఇక ఈసారి శ్రీతేజను తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
![]() |
![]() |